Saturday, 16 April 2016

కొబ్బరి పాయసం





కావలసినవి ::


  1. బొంబాయిరవ్వ: కప్పు, 
  2. కొబ్బరిపాలు: 3 కప్పులు, 
  3. ఎండుకొబ్బరితురుము: అరకప్పు, 
  4. బెల్లం తురుము: కప్పు, 
  5. నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, 
  6. యాలకులపొడి: అరటీస్పూను, 
  7. డ్రైఫ్రూట్స్‌: తగినన్ని


తయారుచేసే విధానం ::

* ముందుగా పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కాక డ్రైఫ్రూట్స్‌ వేయించి తీయాలి. తరవాత బొంబాయిరవ్వ కూడా వేయించి తీయాలి. వేరే పాన్‌లో కొబ్బరిపాలను పోసి ఉడికించాలి. అందులోనే ఎండుకొబ్బరి తురుము వేసి ఉడికించాలి. తరవాత వేయించిన బొంబాయిరవ్వ, బెల్లంతురుము వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా ఉడికిన తరవాత వేయించిన డ్రైఫ్రూట్స్‌ కలిపితే రుచికరమైన కొబ్బరి పాయసం రెడీ. ఇది వేడిగానూ చల్లగానూ కూడా బాగుంటుంది.

క్రీం సలాడ్‌






కావల్సినవి: 

యాపిల్‌, అరటిపండు, పైనాపిల్‌ - ఒక్కోటి చొప్పున, తాజా పాల క్రీం - ఒకటిన్నర కప్పు, వెన్న - రెండున్నర చెంచాలు, మైదా - నాలుగు చెంచాలు, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, పంచదార - అరకప్పు, ఉప్పు - చిటికెడు, వంటసోడా - చిటికెడు, అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ - తగినన్ని.

తయారీ: 

ఓ పాత్రలో క్రీం, వెన్న, మైదా తీసుకుని మెత్తని పిండి అయ్యేదాకా కలపాలి. ఇందులో ఉప్పు, పంచదార, వంటసోడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, పాలు వేసి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. కొద్దిగా చల్లగా అయ్యాక తింటే చాలా రుచిగా ఉంటుంది.

Thursday, 14 April 2016

వెజ్ పోహా కట్‌లెట్



కావలసినవి: 

  1. అటుకులు - 1 కప్పు, 
  2. ఉడికించిన బంగాళదుంపలు - 2, 
  3. నూనె - 1 కప్పు, 
  4. జీలకర్ర - అర చెంచా, 
  5. ఆవాలు - అర చెంచా, 
  6. సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు,
  7.  మైదా పిండి - అర కప్పు, 
  8. కారం - 1 చెంచా, 
  9. పసుపు - పావు చెంచా, 
  10. తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, 
  11. నిమ్మరసం - 1 చెంచా, 
  12. పచ్చిమిర్చి ముక్కలు - 2 చెంచాలు , 
  13. ఉప్పు - తగినంత, 
  14. చాట్ మసాలా - చిటికెడు


తయారీ: 

అటుకులను 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నీటినంతా పిండేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె వేయాలి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత మైదా పిండి, అటుకులు, చిదిమిన బంగాళదుంప, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని కట్‌లెట్స్‌లాగా చేసుకోవాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి, వీటిని బాగా కాల్చుకోవాలి. అవన్ ఉన్నవాళ్లు బేక్ చేసుకోవచ్చు.

Sunday, 10 April 2016

Methi Rice



Ingredients ::

  1. 1 cup rice
  2. oil
  3. garlic cloves
  4. ½ tbsp cumin
  5.  2  green chillies
  6. ½ cup green peas
  7. 1 cup methi leaves / menthikura
  8.  ½ tbsp garam masala
  9. Turmeric as needed
  10. salt for taste




Method::

Wash and soak rice for about 20 minutes. Cook rice to grainy and cool completely. Saute dry spices in hot oil. Saute methi leaves and peas for 5 minutes. Add masala powder, turmeric and mix well. Switch off the stove. Add cooked cooled rice. Sprinkle salt. If your rice is still hot, then add and set aside to cool do not mix. Mix it when the rice cools down a bit. Mix everything well. If desired can add little lemon juice.Serve with raita or a veggie salad.


Tuesday, 26 January 2016

Preparring lemon mint rice in simple way




lemon mint rice:

lemon pudina rice – one of the most easiest and flavorful rice that can be made for lunch box or for a quick meal.