కావలసినవి ::
- బొంబాయిరవ్వ: కప్పు,
- కొబ్బరిపాలు: 3 కప్పులు,
- ఎండుకొబ్బరితురుము: అరకప్పు,
- బెల్లం తురుము: కప్పు,
- నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు,
- యాలకులపొడి: అరటీస్పూను,
- డ్రైఫ్రూట్స్: తగినన్ని
తయారుచేసే విధానం ::
* ముందుగా పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కాక డ్రైఫ్రూట్స్ వేయించి తీయాలి. తరవాత బొంబాయిరవ్వ కూడా వేయించి తీయాలి. వేరే పాన్‌లో కొబ్బరిపాలను పోసి ఉడికించాలి. అందులోనే ఎండుకొబ్బరి తురుము వేసి ఉడికించాలి. తరవాత వేయించిన బొంబాయిరవ్వ, బెల్లంతురుము వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా ఉడికిన తరవాత వేయించిన డ్రైఫ్రూట్స్ కలిపితే రుచికరమైన కొబ్బరి పాయసం రెడీ. ఇది వేడిగానూ చల్లగానూ కూడా బాగుంటుంది.

No comments:
Post a Comment